Building Collapse : Many feared trapped, Watch

Oneindia Telugu 2017-11-24

Views 9

A portion of a three-storey building today collapsed in Maharashtra’s Bhiwandi. Following the mishap, two NDRF teams have been mobilised present on the spot.

మహారాష్ట్రలోని భీవండిలో మూడంతస్థుల భవనం కుప్పకూలిన ఘటనలో ముగ్గురు చనిపోగా. పది మంది గాయపడ్డట్టు. శిథిలాల కింద సుమారు 20 మంది చిక్కుకొనిపోయారని సమాచారం. ఈ ఘటనలో శిథిలాల కింద ఉన్న వారిని రక్షించేందుకు అధికారులు సహయక చర్య లను ముమ్మరం చేశారు. శుక్రవారం ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది.
గత ఆగష్టులో ఇదే ప్రాంతంలో రెండంతస్థుల భవనం కూలిన ఘటనలో 8 మంది చనిపోయారు. కూలిన మూడంతస్థుల భవనంలో సుమారు 14 కుటుంబాలు నివాసం ఉంటున్నట్టు అధికారులు చెప్పారు. అయితే శిథిలాల కింద ఉన్న వారి పరిస్థితి తెలిసేదాకా మృతుల సంఖ్య, గాయపడిన వారి గురించి ఎటువంటి సమాచారం తెలిసే అవకాశం లేదు. కాగా ప్రమాదం జరిగిన వెంటనే అక్కడే ఉన్న స్థానికులు వెంటనే స్పందించి బాదితులని రక్షించే ప్రయత్నాలు చేపట్టారు.

Share This Video


Download

  
Report form