Kings XI Punjab have been perpetual underperformers in the IPL but they have had a good round of auctions this year. Yuvraj Singh is making a comeback to the side while Chris Gayle, who wasn’t retained by RCB and had gone unsold twice in the auctions, has also been acquired by KXIP.
ఐపీఎల్ వేలానికి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కొత్త ప్రణాళికతో అడుగుపెట్టింది. జట్టు సహ యజమాని అయిన ప్రీతి జింతా వేలంలో క్రికెటర్ పేరు అనౌన్స్ అవడమే ఆలస్యం కొనేందుకు సిద్ధమైపోతూ కనిపించింది. ఎవరూ ఊహించని రీతిలో కొనుగోళ్లు చేపట్టిన జట్టు ఇప్పుడు మరో ఆలోచనలో పడింది. జట్టు పేరు మారిస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తోంది. గత మూడు సీజన్లలోనూ జట్టు ప్రదర్శన మరీ పేలవంగా ఉండటంతో ఫ్రాంఛైజీ ఈ సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో.. పాటు ఈ ఏడాది సీజన్‌కి జట్టుకు ఏ పేరు పెట్టాలా అని యోచిస్తోంది. ఈ మేరకు బీసీసీఐకి ఇప్పటికే పేరు మార్పుపై దరఖాస్తు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ 2018 సీజన్ ఆటగాళ్ల వేలంలో భారీ ధరకి స్టార్ క్రికెటర్లని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. బెంగళూరు వేదికగా గత శని, ఆదివారం జరిగిన ఈ వేలంలో రూ. 11 కోట్లకి ఓపెనర్ కేఎల్ రాహుల్‌ని దక్కించుకున్న పంజాబ్.. రవిచంద్రన్ అశ్విన్ (రూ.7.6కోట్లు), ఆండ్రూ టై (రూ.7.2కోట్లు), అరోన్ ఫించ్ (రూ.6.2 కోట్లు), స్టాయినిస్ (రూ.6.2కోట్లు), కరుణ్ నాయర్ (రూ.5.6కోట్లు), క్రిస్‌గేల్ (రూ.2కోట్లు) కొనుగోలుతో జట్టుని బలిష్టం చేసుకుంది.