�" />
�"/>
�">

GST ని వ్యతిరేకిస్తున్న వారిని చితకబాదిన వర్మ !

Filmibeat Telugu 2018-01-23

Views 803

"Me beating the shit out of imaginary protestors of MiaMalkova‘s GST" RGV tweeted.

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీస్తున్న అడల్ట్ ఫిల్మ్ 'గాడ్ సెక్స్ అండ్ ట్రూత్' చిత్రంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను వర్మ భ్రష్టుపట్టిస్తున్నాడని, యువతను చెడుదారులు తొక్కిస్తున్నాడంటూ ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అయితే రామ్ గోపాల్ వర్మ కేవలం దర్శకుడు మాత్రమే కాదు... అతడికి మార్షల్ ఆర్ట్స్‌లో కూడా ప్రావీణ్యం ఉంది. యంగ్ ఏజ్‌లో ఉన్నపుడే ఆయన కరాటే, కుంగ్ ఫూ లాంటివి నేర్చుకున్నారు. అలా తనకు వచ్చిన విద్యతో ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్' ను వ్యతిరేకిస్తున్న వారిని వర్మ కసితీరా కొట్టాడు. అయితే వర్మ కొందరు వ్యక్తులపై దాడి చేసినట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అయితే వీరంతా వర్మ సెట్ చేసుకున్న మనుషులే కావడం గమనార్హం. తన షార్ట్ ఫిల్మ్ ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్' మీద విమర్శలు చేస్తున్న వారిని, వ్యతిరేకిస్తున్న వారిని వీరిలో ఊహించుకుని ఇలా తన కసి తీర్చుకున్నారు రామ్ గోపాల్ వర్మ.
ఇది ఇలాఉండగా రామ్ గోపాల్ వర్మ పెట్టిన ఈ వీడియో ఫై దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ తన ట్విటర్‌లో ‘ఇలాంటి వ్యక్తితో ప్రేమలో పడకుండా ఉంటారా?'అని సరదాగా ట్వీట్‌ చేశారు. వర్మ తీస్తున్న ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్' షార్ట్ ఫిల్మ్ ను వ్యతిరేకిస్తున్న వారు మాత్రమే కాదు..... సపోర్టు చేస్తున్న వారు ఉన్నారు. ఇలాంటి వాటి వల్ల మన సమాజంలో సెక్స్ మీద అవగాహన పెరుగుతుందని అంటున్నారు.
ఏది ఏమైన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీస్తున్న అడల్ట్ ఫిల్మ్ 'గాడ్ సెక్స్ అండ్ ట్రూత్' చిత్రం ఒక సంచలనంగా మారింది.

Share This Video


Download

  
Report form