ఆర్జీవీ ‘కడప’ వెబ్ సిరీస్ ట్రైలర్ !

Filmibeat Telugu 2017-12-15

Views 2.9K

Sensational film maker Ram Gopal Varma is known for making web series as well. The maverick director has earlier come forward with some Hindi series.

ఇప్పటికే రాయలసీమ ఫ్యానిజంపై 'రక్తచరిత్ర' లాంటి సినిమా చేసిన వర్మ.... కడప రెడ్ల చరిత్రను తన వెబ్ సిరీస్ ద్వారా పూర్తి స్థాయిలో దాని మూలాల నుండి లోతుగా చూపించబోతున్నారు. కడప రెడ్ల చరిత్రపై తాను తీయాలనుకున్న సినిమాకు వ్యక్తులు, సెన్సార్ నిబంధనలు అడ్డు పడుతుండటంతో వర్మ దాన్ని వెబ్ సిరీస్ రూపంలో తీసుకు వస్తున్నారు. తాజాగా 'కడప' వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్లో ఫ్యాక్షనిస్ట్ రాజారెడ్డి, బాంబుల శివారెడ్డి, ఓబుల్ రెడ్డితో పాటు రాజశేఖర్ రెడ్డి, పరిటాల రవి ప్రస్తావన కూడా ఉండటం గమనార్హం.
రాయలసీమ మొగోళ్ళు అమ్మ కడుపులో నుండే కత్తి పట్టుకుని పుడతారు అని.... అక్కడి వారి నమ్మకం అంటూ ‘కడప' వెబ్ సిరీస్ మొదలవుతుంది. ఫ్యాక్షన్ అమ్మ వెలిసింది సీమలో... ఆ అమ్మ గుడి రాయలసీమ అయితే, గర్భగుడి కడప... ఇది రాయలసీమ రెడ్డ చరిత్ర అంటూ వర్మ చెప్పుకొచ్చారు.
‘అదే పనిగా పెట్టుకుంటే ఎవడినైనా చంపవచ్చు' అని ఫ్యాక్షనిస్ట్ రాజారెడ్డి వ్యాఖ్యానించిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా తన వెబ్ సిరీస్ లో వర్మ ప్రస్తావించారు.
‘కడప' వెబ్ సిరీస్ లో చూపిస్తున్నఏ ఒక్క పాత్ర కూడా కల్పితం కాదని, కానీ ప్రాణభయం వలన వారందరి పేర్లు, వారు నివసించిన కొన్ని ఊర్ల పేరు కూడా మార్చడం జరిగిందని వర్మ తెలిపారు. ఈ కథ నాకు తెలిసిన నిజం కాదు... నూటికి నూరుపాళ్లు ముమ్మాటికీ నిజమని వర్మ నొక్కి వక్కానించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS