After Nakshatram flop, Krishna Vamshi career gets in fix. Serioul flops haunted the creative directors. The latest buzz is that Krishna Vamshi is planning to team up with Madhavan.
గులాబీ చిత్రంతో తెలుగు తెరపైకి దూసుకొచ్చిన క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీకి పరిశ్రమలో దిక్కు తోచని పరిస్థితి. ఒకప్పుడు కృష్ణ వంశీ సినిమా అంటే సినీ వర్గాలకే కాదు.. ప్రేక్షకులకు కూడా ఆసక్తి, ఉత్సాహం పెరిగేది. కానీ ఇటీవల కాలంలో వరుసగా సినిమాలు క్యూ కట్టడంతో ఆయన జోష్ టాలీవుడ్‌లో కనిపించడం లేదు. అయితే తాజాగా ఆయన మల్టీస్టారర్ చిత్రంతో ముందుకు వస్తున్నాడనే వార్త మీడియాలో ప్రచారం జరుగుతున్నది.
సాధారణంగా సూపర్ ఫ్లాప్‌లతో ఉన్న దర్శకుడు కనిపిస్తే హీరోలు ముఖం చాటేసుకునే పరిస్థితి. అయితే కృష్ణవంశీ విషయంలో అలా లేదు పరిస్థితి. ఆయనతో సినిమా చేయడానికి యువ, సీనియర్ హీరోలు ముందుకొస్తారని ఇండస్ట్రీలో ఓ టాక్.
చాలా గ్యాప్ తీసుకొని రూపొందించిన సందీప్ కిషన్, సాయిధరమ్ తేజ్‌తో తీసిన నక్షత్రం కూడా దారుణంగా ఫ్లాప్ అయింది. విభిన్నమైన కథతో వచ్చిన ఈ చిత్రం కృష్ణవంశీ ప్రతిష్ఠను పెంచలేకపోయింది. దాంతో కృష్ణవంశీ చాప్టర్ క్లోజ్ అనే మాట కూడా వినిపించింది.