Sri Reddy's Comments : Tammareddy Bharadwaj Counter

Filmibeat Telugu 2018-03-24

Views 1.3K

Tammareddy Bharadwaj About culture in Tollywood Film Industry. Tollywood Veteran Director Tammareddy Bharadwaj talks about Sri Reddy's Comments on culture in film Industry. He Reveals That There is culture Issue in the Film Industry But People Should Take Care of Themselves while Taking a Step.

తెలుగు సినిమా ఇండస్ట్రీలోని కాస్టింగ్ కౌచ్ గురించి శ్రీరెడ్డి, గాయిత్రి గుప్తా లాంటి నటీమణులు మీడియా ఛానల్స్‌కు ఎక్కి పలు సంచలన విషయాలు బయట పెడుతున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజులుగా టీవీ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్‌లో ఇదే హాట్ టాపిక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు.
కాస్టింగ్ కౌచ్ మీద ఈ మధ్య కొంత మంది అమ్మాయిలు టీవీ ఛానల్స్‌కు వచ్చి మాట్లాడుతున్నారు. ఇది నిజమే అని నేను చాలా సార్లు చెప్పాను. ఇపుడు ఓపెన్‌గా కొంత మంది మీడియా ముందుకొచ్చారు కాబట్టి అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే పెద్ద ప్రొడక్షన్స్ హౌస్‌లలో ఇలాంటివి నాకు తెలిసి జరుగవు. డైరెక్టర్లు ఒకరిద్దరు చేస్తున్నారని విన్నాను. నిజమో అబద్దమో నాకు తెలియదు కానీ విన్నాను. వీరు చెప్పేవారిలో వారున్నారో లేదో నాకు తెలియదు. అయితే ఎప్పుడైన ఇంత ఓపెన్ గా వచ్చినపుడు ఆ పేర్లు బయడట పెడితే కశ్చితంగా ఇండస్ట్రీ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది... అని తమ్మారెడ్డి వ్యాఖ్యానిచారు.
మనం ఎవరి పేరు బయట పెట్టకపోతే ప్రయోజనం ఉండదు. ఇలాంటివి జరుగుతున్నాయి అనేది అందరికీ తెలిసిన విషయమే. ఎవరు మోసం చేస్తున్నారు? అనేది బయటకు వస్తే బావుంటుంది. పలానా నూతన నటీనటులు కావాలెను అంటూ టీవీల్లో, పేపర్లలో వచ్చే యాడ్లు చూసి మోసపోవద్దు.
ఇక్కడ సమస్య ఏమిటంటే ఇండస్ట్రీని ఇలా చేయాలి అలా చేయాలి అని నిర్దేశించలేం. వచ్చే వారు చిన్న పిల్లలేం కాదు. ఒక అమ్మాయిని ఏదో చేయబోయాడు అంటే లాగి అక్కడే ఒకటి పీకండి. అలా చేస్తే ఆ అమ్మాయి జోలికి ఎవరూ రారు. రెండో పాయింట్ మనం వెళుతున్నవాడు సరైనోడా? కాదా? వాడు సినిమా తీస్తాడా? తీయడా? వీడి చరిత్ర ఏమిటి అని తెలుసుకోకుండా వెళ్లడం తప్పు.... అని తమ్మారెడ్డి సూచించారు.

Share This Video


Download

  
Report form