Two interesting makeovers for Varun. Again Varun Tej will going to act in romantic movie
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రెండు వరుస విజయాలతో క్రేజీ హీరోగా మారిపోయాడు ఫిదా, తొలిప్రేమ రెండు చిత్రాలు వరుణ్ కు లవర్ బాయ్ ఇమేజ్ ని తెచ్చిపెట్టాయి. దీనితో వరుణ్ వైవిధ్యమైన చిత్రాలు తాను రెడీ అనే సంకేతాలు పంపాడు.
వరుణ్ నటించిన చివరి చిత్రం తొలిప్రేమ. ఈ చిత్రంలో వరుణ్ అద్భుతమైన నటన కనబరిచాడు. మూడు షేడ్స్ లో నటించి మెప్పించాడు.
ఫిదా, తొలిప్రేమ తరువాత చిత్ర వర్గాల చూపు వరుణ్ పై పడింది. వరుణ్ నటించబోయే చిత్రం కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నతరుణంలో ప్రయోగాత్మక చిత్రాన్ని ఎంచుకుని ఆశ్చర్యపరిచాడు. సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో స్పేస్ మూవీలో నటించడానికి వరుణ్ తేజ్ రెడీ అవుతున్నాడు.
ఈ చిత్రంలో వరుణ్ తేజ్ అంతరిక్షంలో ఉన్నట్లుగా నటించడం కోసం ప్రత్యేకమైన ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. స్పేస్ లో ఉండే ప్రత్యేక పరిస్థితుల్లో, ఎలా నటించాలి, ఈతరహా హావభావాలు వ్యక్త పరచాలి వంటి విషయాల్లో వరుణ్ ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.
సాగర్ చంద్ర దర్శత్వంలో వరుణ్ తేజ్ నటించడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందబోతోందట. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ రెండు కొత్త మెకోవర్స్ ని ట్రై చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.