Tammareddy Bharadwaj Supports Hari Teja

Filmibeat Telugu 2018-05-25

Views 1.4K

Tammareddy Bharadwaj Supports Hari Teja.Tammareddy Bharadwaj comments on Audience. Tammareddy Bharadwaj Supports Hari Teja

దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సినిమాపరమైన అంశాలు, సామాజిక రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలని ఎప్పటికప్పుడు తెలియజేస్తుంటారు. ఇటీవల జరుగుతున్న ఘటనలపై ఆయన తనదైన శైలిలో విశ్లేషణలు అందిస్తున్నారు. ఇటీవల సినీనటి హరితేజ మహానటి చిత్రానికి థియేటర్ కు వెళ్లిన సందర్భంగా ఆమె కుటుంబం ఓ మహిళ నుంచి అవమానం ఎదుర్కొనవలసి వచ్చింది. ఈ విషయాన్నీ హరితేజ కన్నీరు పెట్టుకుంటూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించడం, హాట్ టాపిక్ గా మారడం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై తాజగా తమ్మారెడ్డి ఫైర్ అయ్యారు. సదరు మహిళని నిప్పులు చెరుగుతూ విమర్శలు గుప్పించారు.
ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీని చాలా చులకనగా చూడడం ఎక్కువైపోతోంది అని తమ్మారెడ్డి అన్నారు. కొందరు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే కడుపు రగిలిపోతోంది, రెండు పీకాలని కూడా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇటీవల నటి హరితేజకు ఎదురైన అవమానం గురించి తెలుసుకుని తాను ప్రస్తుతం మాట్లాడుతున్నానని తమ్మారెడ్డి అన్నారు. అందరిలాగే హరితేజ ఫ్యామిలీ టికెట్టు కొనుక్కుని సినిమాకు వెళితే అవమానించడం ఏంటని మండిపడ్డారు. సినిమా మగోళ్ల పక్కన మా పిల్లలు కూర్చోరు అని మాట్లాడడం ఎంత దారుణం అని తమ్మారెడ్డి అన్నారు.

Share This Video


Download

  
Report form