Tollywood movies Sapthagiri LLB, Malli Raava, Aakali Poratam, Idhi Maa Prema Katha releasing on Dec 8.
డిసెంబర్ మూడోవారం క్రిస్ మస్ సీజన్, జనవరిలో సంక్రాంతి సీజన్ ఉండటంతో పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. దీంతో డిసెంబర్ మొదటి వారంలో చిన్న సినిమాలన్నీ విడుదలకు క్యూ కట్టాయి.
మొదటి వారంలో 'సప్తగిరి', 'మళ్లీ రావే', 'బిటెక్ బాబులు', 'ఆకలి పోరాటం', 'ఇది మా ప్రేమకథ', రెండో వారంలో 'జులియట్ లవర్ ఆఫ్ ఇడియట్' సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి.
కామెడీ కింగ్ సప్తగిరి కథానాయకుడిగా 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్' వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని నిర్మించిన సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ ప్రై లిమిటెడ్ అధినేత డా.రవికిరణ్ మళ్లీ సప్తగిరి హీరోగా 'సప్తగిరి ఎల్‌ఎల్‌బి' చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం డిసెంబర్ 7న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌కి రెడీ అవుతోంది.
స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సుమంత్ హీరోగా, ఆకాంక్ష సింగ్ ప్రధాన పాత్ర దారులుగా గౌతమ్ తిన్న సూరి దర్శకత్వంలోరాహుల్ నక్క నిర్మించిన రొమాంటిక్ డ్రామా 'మళ్లీ రావా' ఈ చిత్రం ఇటీవలే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్ 8న విడుదలకు సిద్ధమైంది.