A Magic moments on the Tollywood's silverscreen. Nearly 10 movies are set release on Telugu Film industry. Balakrishnudu, Metal Madhilo, Devi Sri Prasad are in the list. These releases created a new buzz in the industry.
సినీ ప్రేక్షకులకు, అభిమానులకు శుక్రవారం వచ్చిందంటే పండుగే పండుగ. ఎందుకంటే కొత్త సినిమాలు వెండితెరను తాకుతాయి. సాధారణంగా ప్రతీ శుక్రవారం ఎక్కువలో ఎక్కువ నాలుగు సినిమాలు విడుదలైతే అదే పెద్ద వార్త. కానీ టాలీవుడ్‌లో గతవారం, ప్రస్తుత వారం భిన్నమైన స్థితి కనిపిస్తున్నది. ఎందుకంటే గతవారం దాదాపు 10 చిత్రాలు, ఈ వారం (శుక్రవారం, నవంబర్ 24) కూడా మరో పది చిత్రాలు తెలుగు తెరపై సందడి చేయనున్నాయి. నిజానికి 11 చిత్రాలు విడుదల కావాల్సి ఉండేది. అయితే లచ్చి సినిమా విడుదలను వాయిదా వేశారు. అయితే ఆ పది చిత్రాలు ఏంటో తెలుసుకుందాం..
బాలకృష్ణుడు..పవన్ మల్లెల దర్శకత్వంలో ఎస్వీఎంపి బ్యానర్‌లో నారా రోహిత్ హీరోగా ఈ చిత్రం తెరకెక్కుతున్నది. నారా రోహిత్ సరసన రెజీనా కసండ్రా నటిస్తున్నది. ఈ చిత్రానికి మెలోడి కింగ్ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో నారా రోహిత్ సిక్స్ ప్యాక్‌తో కనిపించడం విశేషం.
మెంటల్ మదిలో.. పెళ్లిచూపులు తర్వాత నిర్మాత రాజ్ కందుకూరి నిర్మించిన చిత్రం ఇది. ఈ చిత్రంలో శ్రీ విష్ణు, కొత్త తారలు నివేదా పేతురాజ్, అమృత శ్రీనివాసన్ హీరోయిన్లుగా నటించారు. రిలీజ్‌కు ముందే ఈ చిత్రం మంచి టాక్‌ను సంపాదించుకొన్నది.