నాగ్ మూవీలో న్యూ హీరోయిన్.. హాట్‌ ఫోటోస్ షేర్ చేసిన వర్మ!

Filmibeat Telugu 2017-12-01

Views 15

Ram Gopal Varma today declared that he had selected a new heroine for Nagarjuna film. He posted her pics and name. The new heroine name is Myra Sarin.

నాగార్జున హీరోగా రామ్ గోపాల్ వర్మ ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. చిత్రంలో నటించే హీరోయిన్ ఎవరనే విషయంలో మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అయోమయానికి తెరదించుతూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రంలో ఫీమేల్ లీడ్ గా చేస్తున్న అమ్మాయి ఫోటోలు సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.
"నేను నాగార్జునతో తీస్తున్న సినిమాలో ఫిమేల్ లీడ్ ఎవరన్నది మీడియాలో రక రకాల ఊహాగానాలు జరుగుతున్నాయి..అవన్నీ తప్పు.. హీరోయినిగా చేస్తున్నది ఒక కొత్త అమ్మాయి.. తన పేరు మైరా సరీన్. ఈ ఫొటోలు ఆ అమ్మాయివే" అంటూ వర్మ ఎఫ్‌బిలో పోస్టు చేశారు.
ఈ సినిమాలో నాగార్జునకు, మైరా సరీన్‌కు మధ్య ఎలాంటి రొమాంటిక్ సీన్లు ఉండవని అంటున్నారు. రామ్ గోపాల్ వర్మ ఎంచుకున్న కథ పరంగా ఇందులో అలాంటి సీన్ల అవసరం ఉండదని టాక్. నాగార్జునతో పాటు ఆమె కూడా యాక్షన్ సీన్లలో నటించనుందని తెలుస్తోంది.
తన తాజా సినిమాలో నాగార్జునను డిఫరెంట్ లుక్‌లో చూపించబోతున్నాడు వర్మ. ఇందుకోసం నాగ్‌ను కాస్త కండలు పెంచాలని సూచించాడట. ఇందులో నాగార్జున పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS