Speculations are rife that the RGV flick with Nagarjuna is a copy of Hollywood hit film "Taken" (2008), which had Liam Neeson in the lead. Nagarjuna will be seen playing a Police Officer in the movie which Neeson did in the original.
శివ చిత్రం విడుదలై సుమారు పాతికేళ్లు దాటినా ఆ చిత్రం గురుంచి ఇప్పటికి మాట్లాడుతూనే ఉంటాం.. పరిశ్రమలో ఆ చిత్రం ఒక కొత్త ఒరవడిని సృష్టించింది. కథను ప్రేక్షకులకు చెప్పే విధానాన్ని కొత్త పుంతలు తొక్కించింది. ఆ తరువాత కూడా వీరిద్దరూ అంతం, గోవిందా గోవిందా చిత్రాలకు కలిసి పనిచేశారు. ఆ తరువాత సుమారు 24సంవత్సరాల తరువాత రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున నటించబోతున్నాడు అన్న విషయం తెలిసిందే.. ఈ చిత్రంలో నాగార్జున పోలీస్ అధికారి పాత్రలో నటించనున్నాడు.
ఈ క్యారెక్టరైజేషన్ నచ్చడంతోనే నాగ్ వెంటనే కథకు ఓకె చెప్పాడట. అందరూ అనుకుంటున్నట్లు, ఈ ప్రాజెక్టు ఇప్పుడు ఓకె అయినది కాదుట. కొద్ది నెలలుగా దీనిపై డిస్కషన్లు నడుస్తున్నట్లు వినికిడి. ఆర్జీవీ తీయడం ఎలా తీస్తాడో కానీ, స్క్రిప్ట్, నాగ్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ మాత్రం సూపర్ గా సెట్ అయ్యాయని తెలుస్తోంది.
అందుకే నాగ్ ఒకె అనడం, సినిమా ప్రారంభం కావడం జరిగిపోతోంది. మరి వర్మ చూపించే పోలీస్ ఆఫీసర్ గా నాగ్ ఎలా వుంటాడో చూడాలి. అయితే ఈ సినిమా మీద వచ్చిన వార్త కాస్త ఇంట్రస్టింగ్‌గా ఉంది. ముఖ్యంగా సినిమా కథ ఒక హాలీవుడ్ సినిమా నుంచి ప్రేరణగా పొంది వర్మ తెరకెక్కించబోతున్నాడని గట్టిగా కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి.