టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథా, దమ్ లగాకే హైసా, శుభ్ మంగళ్ సావధాన్ లాంటి హిందీ చిత్రాల్లో నటించిన బాలీవుడ్ బ్యూటీ భూమి పడ్నేకర్ జులై 18న తన 29వ పుట్టినరోజు వేడుక జరుపుకుంది. ఈ వేడుకకు బాలీవుడ్ స్టార్స్ వరుణ్ ధావన్, కరణ్ జోహార్, వాణి కపూర్‌తో సహా పలువురు తారలు హాజరయ్యారు. ప్రత్యేకంగా డిజైన్ చేసిన బ్లాక్ డ్రెస్సులో భూమి పడ్నేకర్ సెక్సీ లుక్‌లో అందంగా మెరిసిపోయింది.