సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార నేడు తన 34వ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంటోంది. ఈ సందర్భంగా ఆమె ప్రియుడు సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. హాట్ బ్యూటీ ఊహించని విధంగా బర్త్ డే బాష్ ప్లాన్ చేశాడు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నయనతార కొంతకాలంగా తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో ప్రేమాయణం సాగిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు. ప్రస్తుతం ఇద్దరూ కలిసే జీవిస్తున్నారు. అయితే అఫీషియల్‌గా పెళ్లి చేసుకోవడమే తరువాయి.