I-T Department Raids In Tamil Nadu Again, Watch | Oneindia Telugu

Oneindia Telugu 2017-11-28

Views 55

It seems the Income Tax (I-T) Department raids in Tamil Nadu will not end anytime soon. Just days after raid at Poes Garden residence of former chief minister J. Jayalalithaa, the I-T Department conducted raids at around 21 locations in the capital city Chennai.

తమిళనాడులో మళ్లీ ఆదాయపన్ను శాఖ అధికారులు పంజా విసిరారు. చెన్నై నగరంతో సహ తమిళనాడులోని 30 ప్రాంతాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఎస్ పీఐ సినిమా గ్రూప్స్, సత్యం గ్రూప్స్ సంస్థలను లక్షంగా చేసుకుని దాడులు మొదలైనాయి. ఎస్ పీఐ సినిమాస్ యాజమాన్యం సత్యం థియేర్స్ ను నిర్వహిస్తున్నారు. అంతే కాకుంగా మార్గ్ గ్రూప్, ఎస్ 2, మిలీనియం సంస్థల మీద దాడులు చేశామని ఆదాయపన్ను శాఖ అధికారులు ఓ జాతీయ మీడియా సంస్థకు చెప్పారు. తమకు వచ్చిన పక్కా సమాచారంతోనే సోదాలు చేస్తున్నామని ఆదాయపన్ను శాఖ అధికారులు అంటున్నారు.
నవబంర్ 9వ తేదీ చిన్నమ్మ శశికళ కుటుంబ సభ్యులను లక్షంగా చేసుకుని తమిళనాడులో ఏకకాలంలో 187 ప్రాంతాల్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు చేసిన విషయం తెలిసిందే. అదే సందర్బంలో శశికళ మేనల్లుడు వివేక్ కు చెందిన జాజ్ సినిమాస్ కార్యాలయంలో సోదాలు చేశారు.
జాజ్ సినిమాస్ కార్యాలయంలో లభించిన కొన్ని పత్రాలు పరిశీలించిన ఆదాయపన్ను శాఖ అధికారులు ఇప్పుడు మళ్లీ సోదాలు మొదలు పెట్టారని తెలిసింది. ఒకే నెలలో రెండు సార్లు ఐటీ శాఖ అధికారులు భారీ స్థాయిలో సోదాలు మొదలు పెట్టడంతో తమిళనాడు ప్రజలు ఉలిక్కిపడ్డారు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS