Poes Garden IT Raids | Oneindia Telugu

Oneindia Telugu 2017-11-18

Views 316

The Income Tax department on late Friday night conducted raids at jailed All India Anna Dravida Munnetra Kazhagam (AIADMK) leader V.K. Sasikala and her relatives' properties in Chennai's Poes Garden.

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన పోయెస్ గార్డెన్ లోని వేదనిలయంలో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేశారు. మద్రాసు హైకోర్టు అనుమతితో ఐటీ శాఖ అధికారులు పోయెస్ గార్డెన్ లోని వేదనిలయంలో సోదాలు చేశారు.
శశికళ వదిన ఇళవరసి కుమారుడు, జాజ్ సినిమా సీఇవో, జయ టీవీ ఎండీకి ఫోన్ చేసిన ఆదాయపన్ను శాఖ అధికారులు పోయెస్ గార్డెన్ తాళాలు తీసుకురావాలని ఆదేశాలు జారీ చేశారు. వివేక్ పోయెస్ గార్డెన్ లోని వేదనిలయం తాళాలు తీసుకుని వెళ్లి ఆదాయపన్ను శాఖ అధికారులకు అప్పగించాడు.
వివేక్ దగ్గర తాళాలు తీసుకున్న ఆదాయపన్ను శాఖ అధికారులు వేదనిలయంలోకి వెళ్లి శశికళ గది, జయలలిత మేనేజర్ పున్ కుందరన్ గది, రికార్డుల గదుల్లో సోదాలు చేశారు. శశికళ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఒక ల్యాప్ టాప్, నాలుగు పెన్ డ్రైవ్ లు, డాక్యుమెంట్ల కోసం వేదనిలయంలో సోదాలు చేశామని, వాటిని సీజ్ చేశామని ఐటీ శాఖ అధికారులు చెప్పారు
జయలలిత గదిలో సోదాలు చేశామని, చెయ్యలేదనే విషయంలో మాత్రం ఐటీ శాఖ అధికారులు క్లారిటీ ఇవ్వలేదు. పోయెస్ గార్డెన్ లోని వేదనిలయంలో ఐటీ శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారని తెలుసుకున్న టీటీవీ దినకరన్, ఆయన మద్దతు దారులు అక్కడికి చేరుకుని నానా హంగామా చేశారు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS