IT Raids : మిడాస్ మద్యం బంద్ : కీలకంగా 'పూంగుండ్రన్' | Oneindia Telugu

Oneindia Telugu 2017-11-20

Views 2.9K

Sources in the I-T department then told media that the raids were confined to the room that was used as an office by Jayalalithaa's long time personal secretary Poongundran.

ఆదాయపన్ను శాఖ అధికారులు శశికళ కుటుంబ సభ్యులకు చెందిన 85 బ్యాంకుల్లోని 250 లాకర్లు తెరచి పరిశీలించేందుకు చర్యలు వేగవంతం చేశారు. శశికళ కుటుంబ సభ్యులకు చెందిన అందర్నీ విచారణ చేసి వివరాలు సేకరించాలని ఐటీ శాఖ అధికారులు సిద్దం అయ్యారు.చిన్నమ్మ శశికళను గురిపెట్టి జరిగిన ఐటీ సోదాలు ఆమె ఫ్యామిలీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇందులో భాగంగా తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత సహాయకుడు పూంగుండ్రన్‌ ఇచ్చిన సమాచారం మేరకు పోయెస్‌ గార్డెన్‌లోని వేద నిలయంలో ఐటీ శాఖ సోదాలు జరిగాయని తెలిసింది.
పోయెస్ గార్డెన్ లోని వేదనిలయంలోని అనేక గదుల్లో ఐటీ శాఖ సోదాలు జరిగినా జయలలిత గదిలో మాత్రం సోదాలు జరగలేదని సమాచారం. జయలలిత ఇంటిలో ల్యాప్ టాప్, పెన్‌ డ్రైవ్ లు, విలువైన పత్రాలను ఐటీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అందులో లభించిన సమాచారం మేరకు బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఉన్న శశికళ, ఆమె వదిన ఇళవరసిని విచారణ చెయ్యాలని అధికారులు నిర్ణయించారని తెలిసింది.అయితే శశికళ, ఇళవరసిని విచారణ చెయ్యాలని ఇంత వరకు ఐటీ శాఖ అధికారులు మమ్మల్ని సంప్రధించలేదని కర్ణాటక జైళ్ల శాఖ అధికారులు అంటున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS