100 కోతులను పోషిస్తున్నాడు : Indian Man Feeding Monkeys for Decades | Oneindia Telugu

Oneindia Telugu 2017-11-25

Views 1.5K

Krishna Kumar Mishra uses his hands to feed monkeys, lovingly loving them, and also raises the loaves for more monkeys. Many times he fight with his wife too.

మనుషులు తమ అవసరాల కోసం అరణ్యాలను ధ్వంసం చేస్తుండటంతో వణ్యప్రాణులు జనావాసాల్లోకి వస్తున్న పరిస్థితి ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా పెద్ద సమస్యగా తయారైంది. హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కోతుల బెడదకు పరిష్కారం చూపించడం ఏకంగా ఎన్నికల మేనిఫెస్టోలోను ఎక్కడం గమనార్హం. కోతులు వాపస్ పోవాలంటే అరణ్యాలను పెంచడం ఒక్కటే మార్గమని ఇటు తెలంగాణలో సీఎం కేసీఆర్ పదేపదే ప్రస్తావిస్తున్న సంగతి తెలిసిందే. జనావాసాల్లోకి వచ్చే కోతులు తమ ఆహారం కోసం ఇళ్లలోకి దూరడం, ఆహార పదార్థాలను ఎత్తుకెళ్లడం వంటి సంఘటనలు తరుచూ చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో వాటిని తరమడం, కొన్నిసార్లు అవి దాడి చేయడం, లేదా మనుషులే వాటిపై దాడి చేస్తున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
అలా కాకుండా.. ఉత్తరప్రదేశ్ లో ఓ వ్యక్తి గత నాలుగు దశాబ్దాలుగా కోతులను పోషిస్తూ వాటికి తిండి సమకూర్చడం కోసం నిరంతరం శ్రమిస్తున్నాడు. మానవత్వాన్ని ప్రపంచమంతా విస్తరించాలన్న ఉద్దేశమే కోతుల పట్ల తనకింత ప్రేమ ఏర్పడటానికి కారణమని చెబుతారాయన. ఇంతకీ ఎవరా వ్యక్తి అంటే కృష్ణకుమార్ మిశ్రా.

Share This Video


Download

  
Report form