In Instagram, Pietersen uploaded an video of him feeding the leopard cub from a bottle.
ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్‌కు క్రికెట్‌తో పాటు జంతువులంటే ఎంతో ఇష్టం. ఈ విషయాన్ని అనేక సార్లు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే. గత వారం ఇండియాకు వచ్చిన పీటర్సన్ రాయ్‌పూర్‌లో ఒక బుల్లి చిరుతను దత్తత తీసుకున్నాడు. ఈ ఏడాది జనవరిలో ఇండియాలో దాదాపు 40 చిరుతలను వేటగాళ్లు చంపేయడం బాధించిందని, అందుకే అనాథగా ఉన్న చిరుత పిల్లను అక్కున చేర్చుకున్నానని పీటర్సన్ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. అంతేకాదు ఛత్తీస్‌గఢ్‌కు వచ్చిన పీటర్సన్ ఆ చిరుత ఒక సీసా ద్వారా పాలు పట్టించాడు.
ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి.. ఇందులోనే సంతోషం ఉన్నది. నా చిన్నారి చిరుత ఎంత అందంగా ఉన్నదో? అన్న కామెంట్‌ను కూడా పోస్టు చేశాడు.