అఖిల్ అమ్మా నాన్నా వీళ్ళేనట ! "హలో" చెప్పమంటున్నాడు

Filmibeat Telugu 2017-11-23

Views 965

In the first attempt, Akhil introduced his character by name Avinash with a message - 'Say Hello! to Avinash'. And then, The Akkineni Scion introduced his Amma (Ramya Krishna) & Nanna (Jagapathi Babu).

అఖిల్ డెబ్యూ సినిమానే దారుణంగా దెబ్బ కొట్టింది. మంచి లవ్స్టోరీతో వస్తాడనుకున్న అఖిల్ ప్రపంచాన్నే కాపాడే వీరుడు గా తెరమీదకి వచ్చి పెద్ద డిజాస్టర్‌తో నిరాశ చెందాడు. అందుకే రెండో సినిమాతో ఎలాగైనా హీరోగా సత్తా చాటాలని అక్కినేని అఖిల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న చిత్రం 'హలో'. అక్కినేని ఫ్యామిలీకి 'మనం' వంటి మెమెరబుల్ మూవీని ఇచ్చిన విక్రమ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈ సినిమాని ఎలా యినా మంచి హిట్ చేయాలన్న తపన అక్కినేని నాగార్జునలో కూడా కనిపిస్తోంది. అందుకే కాస్త సీరియస్‌గా ఈ సినిమా మీద దృష్టిపెట్టాడు. రామ్‌గోపాల్ వర్మ తో చేస్తున్న సినిమాని చూసుకుంటూనే. అఖిల్ సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు.
కాగా రెండు రోజుల క్రితం 'అందరికీ హలో.. సినిమాలోని క్యారెక్టర్‎లను పరిచయం చేసే టైమ్ వచ్చేసింది. అందులో.. ముందు వరుసలో నేనే ఉన్నా. అవినాష్‎కి హలో చెప్పండి' అంటూ తన క్యారెక్టర్‎ని పరిచయం చేసిన అక్కినేని అఖిల్.. తాజాగా ఆయన అమ్మ నాన్నలను కూడా పరిచయం చేశాడు.
సీనియర్ తారలు జగపతిబాబు, రమ్యకృష్ణ లను తమ అమ్మా నాన్నలుగా పరిచయం చేస్తూ.. వాళ్ళతో కలసి సినిమా సెట్లో దిగిన ఫోటోను పోస్ట్ చేసిన అఖిల్.. 'ఈ ఇద్దరికీ పెద్ద హలో చెప్పండి.. వారితో కలసి పనిచేయడం ఎంతో ఆనందకరం. జగపతిబాబు సర్ తన చల్లని హృదయంతో.. రమ్యకృష్ణ మామ్ నాచురల్ అండ్ ఎవర్ గ్రీన్ అందచందాలతో సినిమాకు కొత్త అందం తెచ్చారు' అని టాగ్ చేశాడు.
ఎంతో అందంగా కనిపిస్తున్న ఈ ముగ్గురి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. డిసెంబర్ 22 న వస్తున్న ఈ సినిమా ఇప్పుడిప్పుడే మంచి ఆసక్తి రాబట్టుకుంటోంది.

Share This Video


Download

  
Report form