"Hello" Teaser.. అఖిల్‌ "హలో" టీజర్

Filmibeat Telugu 2017-11-17

Views 498

Akkineni AKhil starring Hello movie official teaser released. This is AKhil’s second film in Tollywood and he made his film debut with Akhil, which failed at box-office.

అక్కినేని యంగ్‌ హీరో అఖిల్‌ కొత్త సినిమా హలో టీజర్‌ నిన్ననే విడుదలైంది. మనం ఫేమ్‌ విక్రమ్‌ కే కుమార్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. అక్కినేని నాగార్జున వాయిస్ ఓవర్ తో 'ద లక్కీయెస్ట్‌ పీపుల్‌ బోర్న్‌ ఆన్‌ ఇన్‌ దిస్‌ ఎర్త్‌. వాళ్లు మాత్రం ఎవరేం చేసినా, ఏం అడ్డు వచ్చినా, తన సోల్‌ మేట్‌ని కలుస్తారు. లైఫ్‌ని షేర్‌ చేసుకుంటారు.' అంటూ టీజ‌ర్‌ ప్రారంభమైంది.
యాక్షన్‌ ప్రాధానంగా మూవీ కొనసాగినట్లు టీజర్ ద్వారా తెలుస్తుంది. మొత్తం యాక్షన్‌ సన్నివేశాలతో నింపేశారు. చిన్నతనంలో విడిపోయిన ఇద్దరు స్నేహితులు.. పెద్దయ్యాక ఆ అమ్మాయిని వెత్కుకుంటూ అన్వేషణ కొనసాగించే యువకుడి పాత్రలో అఖిల్‌ కనిపించబోతున్నాడని హింట్ ఇచ్చేశారు.
టీజర్‌కు తగ్గట్లు అనూప్‌ రూబెన్స్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్‌ ఆకట్టుకుంది.ఇక చివర్లో అఖిల్ హల్లో అని చెప్పే సింగిల్‌ డైలాగ్‌ మాత్రమే ఉంది. జగపతి బాబు, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. డిసెంబర్ 22న హలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS