"8 million and counting on social media As producers of the film we have to clarify the false copyright claim on our teaser. We are proud to have collaborated with really slow motion for an amazing background score. Pheww! What havoc for no reason" Tweets Akhil Akkineni
ఈ మధ్య కాలంలో సినిమా రంగాన్ని పైరసీ, లీకేజ్ లతోపాటు కాపీ అనే పదం కూడా తెగ వేదిస్తుంది. సినిమా పోస్టర్ రిలీజ్ చేసిన, లేదంటే ఏదైన కాన్సెప్ట్ కి సంబంధించి మోషన్ పోస్టర్ విడుదల చేసిన వెంటనే ఇది హాలీవుడ్ మూవీకి కాపీ అంటూ సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ పెడుతుంటారు. అయితే ఇప్పుడు కాపీ కారణంగా అఖిల్ సినిమా టీజర్ యూ ట్యూబ్ నుండే ఎగిరిపోయింది.
సాధారణంగా అన్నపూర్ణ స్టూడియోస్ వారు 'హలో' డిజటాల్ రైట్స్ ను వేరెవరికైనా అమ్మేస్తే.. అప్పుడు సదరు వీడియో పబ్లిషింగ్ రైట్ లేని వాళ్ల ఛానల్స్ నుండి వీడియో తొలగించబడుతుంది. కాని అన్నపూర్ణ స్టూడియో వారి సొంత చిత్రమైన ఈ సినిమా తాలూకు డిజిటల్ రైట్స్ వేరేవారికి ఇచ్చే ఛాన్సు ఉండదు.
కాని ఇక్కడ విషయం ఏంటంటే.. అసలు హలో టీజర్ కోసం అనూప్ రూబెన్స్ కంపోజ్ చేశాడు అనుకుంటున్న మ్యూజిక్ అతనిది కాదట. ఫిన్ ల్యాండ్ కు చెందిన 'ఎపిక్ నార్త్' అనే ఒక కంపెనీదట.
'ఎక్సోసూట్' అనే ఆ కంపెనీ మ్యూజిక్ ను.. యాజిటీజ్ హలో కోసం వాడేసుకున్నారు. కాని కాపీరైట్ కోసం డబ్బులు చెల్లించకుండా వాడుకుంటే వాళ్ళు ఒప్పుకుంటారా? అందుకే కాపీ రైట్ క్లయిమ్ వేయడంతో.. యుట్యూబ్ లో హలో టీజర్ ఎగిరిపోయింది.