Ivanka Trump Visit : వైట్ హౌస్ నుంచి పర్యవేక్షణ, కనీవిని ఎరుగని సెక్యూరిటీ | Oneindia Telugu

Oneindia Telugu 2017-11-23

Views 2.1K

Ivanka Trump, will be looked after by US Secret Service, followed by the Special Protection Group and the intelligence security wing. The outer cordon will be taken up by Telangana Police, which will include highly trained Octopus, Greyhounds.

ఇవాంకా రాకవేళ హైదరాబాద్ హైటెక్ సిటీ పరిసర ప్రాంతాలు సర్వాంగ సుందరంగా ముస్తాబైన సంగతి తెలిసిందే. అడుగడుగునా కట్టుదిట్టమైన భద్రత.. చీమ చిటుక్కుమన్నా గుర్తించగలిగేలా నిఘా.. ఆఖరికి ఆహార పదార్థాలకు కావాల్సిన దినుసులు కూడా అమెరికా నుంచే తెప్పిస్తుండటం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఇవాంకా రాకవేళ అన్నీ విస్తుగొలిపే విషయాలే.
అమెరికా రూపొందించిన ప్రత్యేక శాటిలైట్ ద్వారా ఇవాంకా భద్రతను పర్యవేక్షించనున్నారు. హైదరాబాద్ లో అడుగు పెట్టింది మొదలు తిరిగి అమెరికా చేరేవరకు అడుగడుగునా దీని నిఘా కొనసాగుతుంది. శాటిలైట్ ద్వారా వచ్చే చిత్రాలను విశ్లేషించడానికి వెస్టిన్‌ హోటల్‌లో ప్రత్యేకంగా కమాండ్‌ పోస్ట్‌ ఏర్పాటు చేస్తుండటం గమనార్హం.
హై రిజల్యూషన్‌ కెమెరాలతో ఫొటోలు తీయడం ఈ శాటిలైట్ ప్రత్యేకతగా చెబుతున్నారు. ఇవాంకా భద్రత కోసం అమెరికా నుంచే కాన్వాయ్, భద్రతా సిబ్బంది తరలిరానున్నారు. అమెరికన్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ అక్కడినుంచే తమ ఆయుధాలను వెంట తెచ్చుకోనున్నారు. ఇప్పటికే 11 రకాలైన ఆయుధాలను తీసుకు రావడానికి అవసరమైన వెపన్స్‌ పర్మిట్‌ను కేంద్రం వారికి జారీ చేసింది. పిస్టల్స్, సబ్-మెషీన్ గన్, స్నైపర్ రైఫిల్స్ లాంటి ఆయుధాలు వీటిలో ఉన్నట్టు తెలుస్తోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS