Ivanka Trump India Visit : మీ సెల్ ఫోన్ మీద కూడా నిఘా ఉంటుంది, జాగ్రత్త

Oneindia Telugu 2017-11-14

Views 1

Ivanka Trump to visit Hyderabad for the Global Entrepreneurship Summit (GES) in November this year is being accorded additional security.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా హైదరాబాద్‌లో అడుగుపెడుతున్న వేళ.. కేంద్రానికి కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. ఇవాంకా భద్రత కోసం భారత ప్రధాని నరేంద్ర మోడీ భద్రతను సైతం పణంగా పెట్టాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.ఇవాంకా ఇండియాలో అడుగుపెట్టింది మొదలు.. తిరిగి వెళ్లేదాక ఆమె భద్రత మొత్తం అమెరికన్ వైట్ హౌజ్ నిఘా నీడలోనే కొనసాగనుంది. వైట్ హౌజ్ భద్రతా సిబ్బంది ఉన్న ప్రదేశంలో భారత భద్రతా సిబ్బంది ఆయుధాలు లేకుండానే విధులు నిర్వర్తించాల్సి ఉంటోంది. ఈ మేరకు వైట్ హౌజ్ వర్గాల నుంచి మార్గదర్శకాలు రావడంతో కేంద్రానికి ఏం చేయాలో పాలుపోవడం లేదు.ఈ నెల 28, 29 తేదీల్లో హైదరాబాద్‌లో ఇవాంకా ట్రంప్ పర్యటించనున్నారు.ఈ నేపథ్యంలో హెచ్‌ఐసీసీలో జరిగే 8వ గ్లోబల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ సమ్మిట్‌(జీఈఎస్)లో భారత పోలీస్‌ అధికారులు, సిబ్బంది ఆయుధాలతో రావడానికి వీల్లేదని అమెరికా సెక్యూరిటీ వింగ్‌ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.
టర్కీలో భద్రత విధులకు వచ్చిన స్థానిక పోలీసు అధికారి రష్యన్‌ అంబాసిడర్‌పై కాల్పులు జరిపిన నేపథ్యంలో ఇవాంకా ట్రంప్ భద్రతను మొత్తం వైట్ హౌజ్ వర్గాలే పర్యవేక్షించనున్నాయి. ఈ క్రమంలోనే దేశీ భద్రతా సిబ్బంది ఆయుధాలతో రావొద్దని వారు ఆంక్షలు విధిస్తున్నారు. ఇప్పటికే దాదాపు నెల రోజుల నుంచి హైదరాబాద్ లో మకాం వేసిన అమెరికన్ భద్రతా సిబ్బంది ఇవాంకా పర్యటనా ఏర్పాట్లను, భద్రతను పర్యవేక్షిస్తున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS