Ivanka Trump's hyderabad visit : ఆద్యంతం రహస్యం, ధోనీ వస్తున్నాడా ?

Oneindia Telugu 2017-11-21

Views 2.1K

Us Secret Services officials are maintaining Ivanka Trump's hyderabad visit is very secreat. They already informed to not to come for even welcome invitation to Ivanka when she arrived at Samshabad Airport. The first daughter is visiting the country to attend the Global Entrepreneurship Summit, and is expected to have dinner with international delegates on the 101 dining table, one of the world's largest dining tables, at Taj Falaknuma Palace, in Falaknuma area.

భాగ్యనగరంలో ఈనెల 28వ తేదీ నుంచి మూడు రోజులపాటు జరగనున్న గ్లోబల్ ఎంట్రపెన్యూర్‌షిప్ సమ్మిట్(జీఈఎస్)లో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ విచ్చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇవాంకా హైదరాబాద్ పర్యటన యావత్తూ అత్యంత రహస్యంగా జరగనుంది. ఆమె ఎప్పుడు హైదరాబాద్ చేరుకుంటారు? ఎక్కడ బస చేస్తారు? భాగ్యనగరంలో ఏయే ప్రాంతాలను ఇవాంకా సందర్శిస్తారు? ఇలాంటివన్నీ దేవరహస్యమే!

శంషాబాద్ విమానాశ్రయంలో ఇవాంకా అడుగుపెట్టే సమయంలో అధికారిక హోదాలో ఆమెను ఆహ్వానించేందుకు ఎవరూ రావద్దని కూడా అమెరికా భద్రతాధికారులు సమాచారం అందించారు. దీంతో ఆమె ఎన్నిగంటలకు హైదరాబాదులో ల్యాండ్ అవుతారు? ఎక్కడ బస చేస్తారు? ఏఏ కార్యక్రమాల్లో పాల్గొంటారు? వంటి వివరాలన్నీ రహస్యంగా మిగిలిపోయాయి. అయితే ఇవాంకా పర్యటనను మరీ ఇంత రహస్యంగా ఉంచడానికి కేవలం భద్రతా కారణాలేనా? మరేమైనా కారణాలున్నాయా? అన్నది అంతుబట్టడం లేదు.

Share This Video


Download

  
Report form