Nandi awards Issue, This debate show had several guests to give their piece of mind on the issue. While producer Bunny Vasu felt that the “Mega Family” was being unjustly neglected for the awards. Mega Star and Congress Party leader Chiranjeevi belongs to all, says Andhrajyothy MD Radhakrishna.
ఏపీ ప్రకటించిన నంది అవార్డులపై వివాదం కొనసాగుతోంది. అవార్డుల్లో రుద్రమదేవి, రేసుగుర్రం వంటి సినిమాలకు తీవ్ర అన్యాయం జరిగిందని చాలామంది మండిపడుతున్నారు. మరోవైపు అవార్డుల్లో ఎలాంటి అన్యాయం జరగలేదని మరొకరు అంటున్నారు.
ఈ నేపథ్యంలో అవార్డుల వివాదంపై ఆంధ్రజ్యోతి ఓపెన్ డిబెట్ నిర్వహిస్తోంది. ఇందులో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వారి వారి అభిప్రాయాలను, వాదాలను వినిపించారు. ఈ సందర్భంగా నిర్మాత బన్నీ వాసు చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ వారించారు.
బన్నీ వాసు నంది అవార్డుల ప్రకటన లోపభూయిష్టంగా ఉందని మొదటి నుంచి చెబుతున్నారు. డిబెట్‌లో ఆయన మాట్లాడుతూ.. మా చిరంజీవి, మా మెగా ఫ్యామిలికీ 2002 నుంచి అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేసారు.