Nandi Awards : 'కమ్మ' అవార్డులు, సైకిల్ అవార్డులు ! 'లెజెండ్‌' లో అసలేముంది ?

Oneindia Telugu 2017-11-16

Views 2.1K

The heat erupted over Nandi Awards announced by AP state government yesterday is not going to cool down anytime soon as debate continues with opposition rages.

నంది అవార్డులపై బారీగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై స్పందించేందుకు హిందూపురం శాసన సభ్యుడు, నటుడు నందమూరి బాలకృష్ణ నిరాకరించినట్లుగా తెలుస్తోంది.
నంది అవార్డులపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ అవార్డుకు సంబంధించి పలువురు సినీ ప్రముఖులు తెలుగుదేశం ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. నంది అవార్డులు ఎక్కువగా ఓ సామాజిక వర్గానికి వచ్చాయని మండిపడుతున్నారు. టీడీపీకి అనుకూలంగా ఉన్న వారికి అవార్డులు ఇచ్చారని ధ్వజమెత్తుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన నంది అవార్డుల ఎంపికపై సోషల్ మీడియాలో విమర్శలు ఆగడం లేదు. నంది అవార్డుల కోసం సినిమా ఎంపిక జరుగలేదు. కేవలం పంపకాలు మాత్రమే జరిగాయి అనే వాదనను సోషల్ మీడియాలో నెటిజన్లు బలంగా వినిపిస్తున్నారు. ఈ వ్యవహారం మీడియాలో కూడా చర్చనీయాంశమవుతున్నది. ఈ వ్యవహారంపై తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తూ నంది అవార్డులు కావు.. నందమూరి అవార్డుల అనే స్థాయికి ఆరోపణలు చేరాయి. కొందరు విమర్శకులైతే నందమూరి బాలక‌‌‌ృష్ణ కాదు.. నందిమూరి బాలకృష్ణ అనే కామెంట్లు చేస్తున్నారు.టీడీపీ ఎమ్మెల్యే, నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందిన 'లెజెండ్‌' చిత్రానికి నంది అవార్డుల్లో పెద్దపీట వేయడం ప్రధానంగా విమర్శలకు తావిచ్చింది. లెజెండ్‌కు ఏకంగా ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ విలన్‌ ఇలా తొమ్మిది నంది అవార్డులు దక్కాయి. అయితే, మాస్‌ మసాల కమర్షియల్‌ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాకు ఇన్ని నంది అవార్డులు రావడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.తెలుగు సినిమా పరిశ్రమ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు నటించిన చివరి చిత్రం ‘మనం' పరిగణనలోకి తీసుకోవడంపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. చక్కని కుటుంబ కథా చిత్రంగా రూపొందిన మనం చిత్రాన్ని కాదని, కమర్షియల్ హంగులతో తెరకెక్కిన లెజెండ్‌కు అవార్డులు ఇవ్వడమా అని అంటున్నారు. టాలీవుడ్‌కు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన ఏఎన్నాఆర్‌ను గౌరవించుకోవడం ఇదేనా అని సోషల్ మీడియాలో నిలదీస్తున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS