Gunasekhar came down heavily on AP Government for not giving due prominence to 'Rudramadevi' in the Nandi Awards. Forget about Best Film award, This historical subject based on Telangana Queen wasn't even considered for either 2nd/3rd Best Film or Special Jury award.
రుద్రమదేవి సినిమా కనీసం ఎలాంటి జ్యూరీ గుర్తింపునకు కూడా నోచుకోలేకపోయిందని సినీ దర్శకుడు గుణశేఖర్ ప్రశ్నించారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్ళ పాటు ప్రకటించిన నంది అవార్డుల విషయమై గుణశేఖర్ అసంతృప్తిని వ్యక్తం చేశారు.ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు దర్శకుడు గుణశేఖర్ బుదవారం నాడు లేఖ రాశారు.
రుద్రమదేవి సినిమాకు వినోదపు పన్ను ఎందుకు మినహాయింపు ఇవ్వలేదని ప్రశ్నించడం తప్పా అంటూ గుణశేఖర్ ప్రశ్నించారు.అంతేకాదు 'గౌతమీపుత్ర శాతకర్ణి'కి వినోదపు మినహాయింపు ఇచ్చి తన చిత్రానికి ఎందుకివ్వలేదని గతంలో ఆయన ప్రశ్నించారు. తాజాగా ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల్లో రుద్రమదేవికి చోటు దక్కలేదు. ఏపీ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన 2014, 15,16, సంవత్సరాల అవార్డుల విషయంలో ఎవరు ప్రశ్నించినా వాళ్లని మూడేళ్లపాటు అవార్డులకి అనర్హులుగా ప్రకటిస్తారంటూ గుణశేఖర్ వ్యంగ్యాస్త్రాలు ట్విట్టర్ వేదికగా సంధించారు.