Play on Day 2 called off. The rains refused to stop leading the match officials to call off the day's play. India are 74/5 after 32.5 overs in their first innings of Day 2.
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా కష్టాల్లో పడింది. ముఖ్యంగా శ్రీలంక బౌలర్లు భారత టాపార్డర్‌ను కుప్పకూల్చారు. ఈ టెస్టులో టీమిండియా కేవలం 30 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. తద్వారా కోహ్లీసేన ఓ చెత్త రికార్డుని నమోదు చేసింది.
ఏడేళ్ల తర్వాత భారత్ స్వదేశంలో 30 అంతకంటే తక్కువ పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోవడం ఇదే తొలిసారి. చివరిసారి 2010లో న్యూజిలాండ్‌తో అహ్మదాబాద్‌లో జరిగిన టెస్టులో భారత్ 15 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. 17/3 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజైన శుక్రవారం ఆట ప్రారంభించిన భారత్ కష్టాల్లో పడింది.
లంచ్ విరామానికి ముందే రెండు కీలక వికెట్లు చేజార్చుకుంది. ఈ మ్యాచ్‌లో నిలుస్తాడని నమ్మకం పెట్టుకున్న రహానె (4) జట్టు స్కోరు 30 వద్ద పెవిలియన్ చేరాడు. శ్రీలంక బౌలర్ షనకా వేసిన 17.2వ బంతికి పేలవ షాట్ ఆడి డిక్వెలాకు క్యాచ్ ఇచ్చాడు. రహానే అవుటైన తర్వాత క్రీజులోకి అశ్విన్ వచ్చాడు.