A man tried the stunt like Bahubali Prabhas and failed, now he was getting treatment in hospital due to the injuries by Elephant
బాహుబలి 2’ మూవీలో ప్రభాస్ చేసిన స్టంట్ ను రియల్ గా చేయాలని భావించిన యువకుడు ఆసుపత్రిపాలైన ఘటన కేరళలో చోటుచేసుకుంది. సాదారణంగా సినిమాల్లో హీరోల స్టంట్లను చూసి.. నిజ జీవితంలోను వాటిని అనుసరించే అభిమానులు చాలామందే ఉంటారు. కానీ స్టంట్ ఏమాత్రం తేడా కొట్టినా.. ప్రాణాల మీదకు రావడం ఖాయం. తాజాగా కేరళకు చెందిన ఓ యువకుడు కూడా ఇదే తరహాలో విఫలయత్నం చేశాడు. బాహుబలి-2 సినిమాలో మాదిరి ఏనుగు పైకి ఎక్కాలనుకునున్నాడు. వీడియో తీయమని తన స్నేహితుడికి చెప్పి ఏనుగు వద్దకు వెళ్లాడు. మొదట ఓ అరటిపండు తీసి దానికి తినిపించాడు.
తరువాత దాని తలపై సుతారంగా ముద్దు పెట్టాడు. అప్పుడు కూడా మౌనంగా ఉంది. అంతటితో ఆగని ఆ యువకుడు మెల్లగా దాని దంతాలు పట్టుకుని పైకి ఎక్కేందుకు ప్రయత్నించాడు. అంతే, తొండంతో ఒక్కసారిగా అతన్ని విసిరిపారేసింది. వెంటనే తేరుకున్న స్నేహితుడు.. అతన్ని ఆసుపత్రికి తరలించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.