CWG Gold Medallist Weightlifter Sanjita Chanu Fails Dope Test

Oneindia Telugu 2018-06-01

Views 58

Two-time Commonwealth Games medallist Sanjita Chanu has tested positive for a banned anabolic steroid and has been provisionally suspended, the International Weightlifting Federation (IWF) said on Thursday. Chanu had won the gold medal in the 53kg category at the Games in Gold Coast and 48kg in Glasgow four years ago. She has been handed a provision suspension for now.

కామన్వెల్త్‌ క్రీడల్లో సత్తా చాటిన భారత్‌కు ఇది దిగ్భ్రాంతి కలిగించే పరిణామమే. డోపింగ్‌ భూతం మళ్లీ భారత వెయిట్‌లిఫ్టింగ్‌ను పట్టుకుంది. గోల్డ్‌కోస్ట్‌ క్రీడల్లో స్వర్ణం సాధించిన సంజిత చాను (53 కేజీ) డోప్‌ పరీక్షల్లో విఫలమైంది. నిషిద్ధ ఉత్ప్రేరకం వాడినట్లు పరీక్షల్లో తేలడంతో చానుపై ప్రాథమిక సస్పెన్షన్‌ విధించినట్లు అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్‌ సమాఖ్య (ఐడబ్ల్యూఎఫ్‌) తెలిపింది.
చాను శరీరంలో టెస్టొస్టెరోన్‌ చాలా ఎక్కువగా ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. డోపింగ్‌ నిరోధ నిబంధనలను ఉల్లంఘించి ఉండొచ్చన్న ఉద్దేశంతో ఆమెపై ప్రాథమికంగా సస్పెన్షన్‌ విధించాం' అని ఐడబ్లూఎఫ్‌ తన వెబ్‌సైట్లో పేర్కొంది.

Share This Video


Download

  
Report form