Indias two World Cup winning captains Kapil Dev and Mahendra Singh Dhoni on Thursday took on one another on the cricket pitch, with a bunch of kids egging them on at the Eden Gardens.
భారత క్రికెట్‌లో వారిద్దరికి ప్రత్యేక స్ధానం ఉంది. కెప్టెన్లుగా భారత్‌కు వరల్డ్ కప్‌లను అందించారు. వేర్వేరు తరాలకు చెందిన వారు కావడంతో వారిద్దరూ కలిసి ఆడే అవకాశం ఎప్పుడూ రాలేదు. అయితే ఓ యాడ్ షూటింగ్ కోసం వారిద్దరూ ఇప్పుడు జత కట్టారు. ఆ ఇద్దరూ ఎవరో కాదు... కపిల్ దేవ్, మహేంద్ర సింగ్ ధోని. గురువారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో క్రికెట్ దిగ్గజం పిల్ దేవ్, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఒక వ్యాపార ప్రకటన నిమిత్తం సందడి చేశారు. షూటింగ్‌లో భాగంగా కపిల్ బౌలింగ్ చేయగా, ధోని బ్యాటింగ్ చేశాడు.
ఆ తర్వాత ధోని కూడా కపిల్ దేవ్‌కు బౌలింగ్ చేయడం విశేషం. ఈ యాడ్ షూటింగ్‌ని చూసేందుకు పెద్ద ఎత్తున చిన్నారులు ఈడెన్ గార్డెన్స్‌కు తరలివచ్చారు. 30 నిమిషాల నిడివి కలిగిన ఈ యాడ్ షూటింగ్‌లో కపిల్ దేవ్, ధోనిలతో పాటు చిన్నారులు కూడా కలిసి నటించారు.