PSV Garuda Vega 123.18M', released on Nov 3, has entered its second week of run with a thunder. Starring Dr. Rajasekhar, Adith Arun, Pooja Kumar and others, the action-thriller has been directed by the versatile Praveen Sattaru, and produced by Jyostar Enterprises.
పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలకు పెట్టింది పేరైన డా.రాజశేఖర్ ఎన్.ఐ.ఎ ఆఫీసర్‌గా నటించిన చిత్రం పిఎస్‌వి గరుడవేగ 126.18ఎం. ఎల్‌బిడబ్ల్యు, చందమామ కథలు, గుంటూరు టాకీస్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రవీణ్ సత్తారు రూపొందించిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. బాక్సాఫీసు వద్ద కూడా ఈ చిత్రం సూపర్ కలెక్షన్స్ వసూలు చేస్తోంది. తొలి 5 రోజుల్లో ఈ చిత్రం రూ. 15 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ విషయాన్ని అఫీషియల్‌గా ఖరారు చేస్తూ నిర్మాత కోటేశ్వర్ రాజు ప్రకటన చేశారు.
మరో వైప గరుడ వేగ రీమేక్ రైట్స్ కోసం ఇతర భాషలకి చెందిన దర్శక నిర్మాతలు పోటీ పడుతున్నారట. తమిళ రీమేక్ రైట్స్ ను ఓ సంస్థకి భారీ రేటుకు ఇచ్చేందుకు రాజశేఖర్ ఒప్పందం చేసుకున్నారని అంటున్నారు. అన్ని భాషల్లోని ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే కంటెంట్ కావడం వలన, ఈ స్థాయిలో డిమాండ్ ఉందని చెప్పుకుంటున్నారు. దీని వల్ల సినిమాకు అదనపు లాభాలు వస్తాయని అంటున్నారు.
ఈ చిత్రాన్ని జ్యో స్టార్ ఎంటర్‌ప్రైజెస్ బేనర్‌పై ఎం.కోటేశ్వర్ రాజు నిర్మించారు. నవంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్‌బస్టర్ టాక్‌ని తెచ్చుకుంది. అంతేకాకుండా సక్సెస్‌ఫుల్ గా రన్ అవుతూ.. కలెక్షన్ల వర్షం కురిపిస్తూ రెండో వారంలో సినిమా రెస్పాన్స్ బావుంటుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.