"Adirindhi" Movie Review అదిరింది మూవీ రివ్యూ

Filmibeat Telugu 2017-11-09

Views 17

Director Atlee, Hero Vijay combination again strike in south with Mersal. Now there come with lapses in Medical and Health system. In this movie Vijay potrayed tree roles effectively. Samantha, Kajal, Nitya menon are in lead pair to Vijay. This movie released on 19 October in Tamil Version.
తెరీ చిత్రం తర్వాత దర్శకుడు అట్లీ డైరెక్షన్‌లో తమిళ సూపర్‌స్టార్, ఇలయ దళపతి విజయ్ నటించిన చిత్రం అదిరింది. అదిరింది చిత్రంలో విజయ్ త్రిపాత్రాభినయం చేశారు. విజయ్ సరసన కాజల్ అగర్వాల్, సమంత, నిత్యామీనన్ హీరోయిన్‌గా నటించారు. విడుదలకు ముందు తెలుగు రాష్ట్రాల్లో సెన్సార్ ఇబ్బందులను ఎదుర్కొన్న అదిరింది చిత్రం నవంబర్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఇప్పటికే తమిళంలో మెర్సల్ పేరుతో విడుదలై సంచలన విజయం దిశగా దూసుకుపోతున్నది.
తమిళనాడులో మెర్సల్ చిత్రాన్ని వివాదాలు చుట్టముట్టడం, తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ ఉన్న విజయ్ నటించిన చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినీ అభిమానుల, ప్రేక్షకుల అంచనాలను ఈ చిత్రం ఏ మేరకు అందుకొన్నదనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
డాక్టర్ భార్గవ్ (విజయ్) నిస్వార్థపరంగా వైద్య వృత్తిని కొనసాగిస్తుంటాడు. కేవలం ఐదు రూపాయలకే వైద్యం అందిస్తుంటాడు. విజయ్ (విజయ్) పాపులర్ మెజిషియన్. డాక్టర్ భార్గవ్ అందించిన అత్యుత్తమ వైద్య సేవలకు గుర్తింపుగా ఫ్రాన్స్ దేశం అవార్డు ప్రకటిస్తుంది. ప్యారిస్‌లో జరిగే కార్యక్రమంలో అవార్డు అందుకొంటాడు. అదే సమయంలో విజయ్ మ్యాజిక్ ప్రదర్శన ప్యారిస్‌లో జరుగుతుంది.

Share This Video


Download

  
Report form