Surya 'Gang' movie review. Directed by Vignesh Shivan and produced by K. E. Gnanavel Raja. The film is an adaptation of the 2013 Hindi film Special 26. The film stars Suriya and Keerthy Suresh in the lead roles, with a supporting cast including Karthik, Ramya Krishnan, Senthil and Suresh Chandra Menon
హీరో సూర్య అంటే మనకు వెండి తెరపై పవర్ ఫుల్ పోలీసాఫీర్ పాత్రే గుర్తుకు వస్తుంది. 'సింగం' 1, 2, 3 ఇలా ఆయన నటించిన మూడూ సినిమాల్లో సూర్య పెర్ఫార్మెన్స్ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేశాయి. సూర్య తాజాగా 'గ్యాంగ్' సినిమా ద్వారా సంక్రాంతి బరిలో దూకారు. 2013లో బాలీవుడ్లో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో వచ్చిన 'స్పెషల్ 26' చిత్రం ఆధారంగా 'గ్యాంగ్' రూపొందింది. మరి నాలుగేళ్ల క్రితం స్టోరీ ఇప్పుడు వర్కౌట్ అయిందా? అసలు అయ్యే అవకాశం ఉందా? నకిలీ సీబీఐ ఆఫీసర్‌గా సూర్య ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించాడో రివ్యూలో చూద్దాం.
తిలక్ (సూర్య), బుజ్జమ్మ( రమ్యకృష్ణ) ఇద్దరూ కలిసి మరికొందరితో కలిసి ఒక గ్యాంగ్‌గా ఏర్పడి నకిలీ సీబీఐ ఆఫీసర్లుగా, నకిలీ ఇన్‌కంటాక్స్ ఆఫీసర్లుగా అవతారం ఎత్తి రైడ్స్ చేస్తూ అవినీతి పరులకు వద్ద ఉండే బ్లాక్ మనీ కొట్టేస్తుంటారు. అది అక్రమ సొమ్ము కావడంతో ఎవరూ కంప్లయింట్ చేయడానికి సాహసించరు. ఈ గ్యాంగ్ చేసే పనులు పోలీస్, సీబీఐ, ఇన్‌కంటాక్స్ డిపార్టుమెంటుకు తలనొప్పిగా మారుతుంది. వీరి ఆటకట్టించడానికి స్పెషల్ ఆఫీసర్ శివశంకర్ (కార్తీక) రంగంలోకి దిగుతాడు. ఈ గ్యాంగ్ ఇదంతా ఎందుకు చేస్తోంది? ఆ డబ్బంతా వారు ఏం చేస్తున్నారు? అనేది ఈ గ్యాంగ్ చిత్ర కధ.