Naa Nuvve Movie Review నా నువ్వే మూవీ రివ్యూ

Filmibeat Telugu 2018-06-14

Views 7

Naa... Nuvve is a Telugu-language romantic comedy film written and directed by Jayendra Panchapakesan and produced by Kiran Muppavarapu and Vijay Kumar Vattikuti under Cool Breeze Cinemas banner while Mahesh S Koneru is presenting the film on East Coast Productions banner. [It features Nandamuri Kalyan Ram and Tamannaah in the lead roles. Cinematographer P. C. Sreeram handled the visuals and Sharreth composed the film's music score. The film is slated to be released on June 14, 2018, worldwide.

ఇటీవల కాలంలో విలక్షణ పాత్రలతో, విభిన్నమైన చిత్రాలతో అలరిస్తున్నారు హీరో నందమూరి కల్యాణ్ రామ్. ఆయన నటించిన ఎమ్మెల్యే చిత్రంతో మంచి సక్సెస్ సాధించారు. యాక్షన్ హీరోగా ముద్ర వేసుకొన్న కల్యాణ్ రామ్ రూట్ మార్చి అందమైన ప్రేమకథా చిత్రం నా నువ్వేతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పీసీ శ్రీరాం ఈ ప్రేమకథను అందంగా మలిచేందుకు ప్రయత్నించారని బలంగా సినీ వర్గాల్లో వినిపించింది. కల్యాణ్ రామ్ ప్రేక్షకులను మెప్పించారా అని తెలుసుకోవాలంటే నా నువ్వే కథేంటో తెలుసుకోవాల్సిందే.
మీరా (తమన్నా భాటియా) రేడియో జాకీ. వరుణ్ (కల్యాణ్ రామ్) అమెరికాకు వెళ్లాలనుకొనే ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. వీరిద్దరి ప్రేమకు లవ్ సైన్ అనే పుస్తకం బీజం వేస్తుంది. వరుణ్ ఫోటోను చూసిన వెంటనే అతడిని తన లక్కీగా భావిస్తుంది. తనకు తెలియకుండానే ప్రేమలో పడిపోతుంది. ఇలా తన మనసులో ఉన్న ప్రియుడి గురించి వెతుకులాట ప్రారంభిస్తుంది. వెతికే క్రమంలో ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి.
చివరకి మీరా, వరుణ్ కలుసుకొన్నారా? తనలోని ప్రేమను వరుణ్‌కు మీరా ఎలా వ్యక్తపరిచారు? ఎలాంటి అడ్డంకులు లేకుండా వారి ప్రేమ ముందుకెళ్లిందా? వారి ప్రేమకు ఎవరు అడ్డంకిగా నిలిచారు? వరుణ్ అమెరికాకు ఎందుకు వెళ్లలేకపోయారు? ఇలాంటి పరిస్థుతుల్లో వారి ప్రేమను ఎలా గెలుచుకొన్నారు? డెస్టినీ వారి ఎలా ఒక్కటి చేసింది అనే ప్రశ్నలకు తెర మీద సమాధానమే నా నువ్వే చిత్ర కథ.
నా నువ్వే దర్శకత్వం వహించడానికి ముందు డైరెక్టర్ జయేంద్ర ఓ యాడ్ ఫిల్మ్ మేకర్. మాస్ ఇమేజ్ ఉన్న కల్యాణ్ రామ్‌ను లుక్ పరంగా పూర్తిగా మార్చివేసి లవర్ బాయ్ ఇమేజ్‌లోకి తీసుకెళ్లాడు. తమన్నా గ్లామర్‌ను జోడించి అందమైన ప్రేమకథను అల్లుకొన్నారు. అయితే కథలో బలమైన పాయింట్ లేకపోవడం, కథ గమనం కూడా సరిగా లేకపోవడం ప్రధానమైన లోపంగా కనిపిస్తుంది. ప్రతీ ఫ్రేమ్‌ను అందంగా చూపించాలనే తపనతో కథ, కథనాలు పెద్దగా పట్టించుకోలేదా అనే ప్రశ్న తొలి అరగంటలోనే ప్రేక్షకుడిని బుర్రను తొలిచేస్తుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS