Australia have slumped to a disastrous 21-run defeat to minnows Bangladesh in a gripping first Test in Dhaka. Set an imposing 265 to win, the visitors were bowled out for 244 after lunch on Wednesday's fourth day, with star allrounder Shakib Al Hasan claiming 5-85 to finish with 10
రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఢాకా వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. 20 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను బంగ్లాదేశ్ చిత్తు చేసింది. ఆల్‌రౌండర్ షకీబ్ ఉల్ హసన్ ఈ మ్యాచ్‌లో పది వికెట్లు తీసి బంగ్లాదేశ్ గెలుపులో కీలకపాత్ర పోషించాడు.
తొలి ఇన్నింగ్స్‌లో 5, రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన షకీబ్ ఆస్ట్రేలియాకు షాకిచ్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 260 పరుగులు చేయగా ఆస్ట్రేలియా 217 పరుగులకే ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 221 పరుగులు చేయడంతో ఆసీస్‌కు 265 పరుగులు విజయ లక్ష్యంగా నిర్దేశించింది.