All set for Reopening of Anna Canteens: పేదలకు పట్టెడన్నం పెట్టలేని ప్రభుత్వాలు ఎందుకన్న నినాదంతోనే అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ గతంలో తెలుగుదేశం హయాంలోనే అన్న క్యాంటీన్లను చంద్రబాబు ప్రారంభించారు. వైసీపీ ప్రభుత్వం కక్షగట్టి వీటిని మూసివేసినా మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాష్ట్రవ్యాప్తంగా రేపు పునఃప్రారంభించనున్నారు. స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా తొలిదశలో 100 అన్నక్యాంటీన్లు పేదలకు అంకితం చేయనున్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో సీఎం చంద్రబాబు లాంఛనంగా అన్న క్యాంటీన్ ప్రారంభించనున్నారు.