Previously, the government signed an agreement with the Akshaya Foundation for the management of the Anna canteens.The deal is expired in this month.AP Govt clarified that Anna Canteens will not be closed and continue with few changes
#apgovt
#annacanteens
#chandrababu
#tdp
#assembly
#Akshayapatrafoundation
#botsasatyanarayana
టీడీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ల పైన శాసనసభలో చర్చ జరిగింది. గత ప్రభుత్వం అన్నా క్యాంటీ న్ల నిర్వహణ కోసం అక్షయ ఫౌండేషన్‌తో ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందం ఈనెల 31తో ముగియనుంది. దీని పైన ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవటంతో ఇక అన్నా క్యాంటీన్లు మూసివేస్తున్నారంటూ ప్రచారం సాగు తోంది. దీని పైన వైసీపీ సభ్యులు శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నించారు. దీనికి సమాధానంగా మంత్రి బొత్సా ప్రస్తుతం ఏపీలో 183 అన్న క్యాంటీన్లు మాత్రమే నడుస్తున్నాయని బొత్స స్పష్టం చేశారు. ఓ లక్ష్యం లేకుండా గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఆదరా బాదరాగా అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసింది. క్యాంటీన్ రంగు మార్చితే పథకం రద్దు చేసినట్టు కాదని బొత్స స్పష్టం చేశారు. పేదవాడి పొట్ట కడుపుకొట్టే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసారు.