South West Monsoon Update: Monsoon towards Telangana State And IMD Predicts rains in Coastal and Rayalaseema Districts of AP
రుతుపవనాలు గురువారం నాటికి తెలంగాణలోకి ప్రవేశించే అవకాశాలున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేస్తున్నది. ఈ నెల 10వ తేదీకే రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాల్సి ఉండగా, ప్రతికూల పరిస్థితుల కారణంగా ఆలస్యం అవుతున్నదని వెల్లడించింది. గురువారం కోస్తా, రాయలసీమలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రాయలసీమ, దక్షిణాంధ్రలోని మరికొన్ని ప్రాంతాలకు, నెల్లూరు జిల్లా కావలి వరకు విస్తరించిన రుతుపవనాల ప్రభావంతో కోస్తాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిశాయి.
#IMD #Monsoon #Rain #WeatherReport #WeatherChange #HeavyRain #Summer #Temperature #HeatWave #Rayalaseemarains #andhrapradesh #Hyderabad
~PR.41~