YS Sharmila questioned What has KTR done to Kodangal, which was adopted by him in the previous election | మునుగోడు ఉప ఎన్నికలలో మునుగోడును దత్తత తీసుకుంటానని మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను టార్గెట్ చేసిన వైయస్ షర్మిల తనదైన శైలిలో మండిపడ్డారు. ఉప ఎన్నికలలో ఓట్లు వేస్తే మంత్రి కేటీఆర్ మునుగోడు నేను దత్తత తీసుకుంటానని చెబుతున్నాడు. అంతకుముందు మునుగోడు తెలంగాణలో లేదా అంటూ ప్రశ్నించారు వైయస్ షర్మిల. మునుగోడు అభివృద్ధి చేయాలంటే అది మీ కంటికి కనిపించలేదు అంటూ నిలదీశారు. మునుపటి ఎన్నికలలో దత్తత తీసుకున్న కొడంగల్ కు మంత్రి కేటీఆర్ చేసింది ఏంటో చెప్పాలని వైయస్ షర్మిల ప్రశ్నించారు. ఓట్లు కావలసి వచ్చినప్పుడు మీకు అభివృద్ధి గుర్తుకు వస్తుందా? వైయస్ షర్మిల నిలదీశారు.
#YSsharmila
#KTR
#Telangana
#CMkcr
#YSRTP