Suryakumar Yadav Explains Why Rohit Sharmas weird gesture for Dinesh Karthik after Maxwell review | మైదానంలో నవ్వులు పూయించేందుకే టీమిండియా వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ పీకను రోహిత్ శర్మ పట్టుకున్నాడని స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. ఇది చాలా సరదా ఘటనని స్పష్టం చేశాడు. ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం నాగ్‌పూర్ వేదికగా జరగనున్న రెండో టీ20 నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ గురువారం మీడియాతో మాట్లాడాడు. జర్నలిస్ట్‌లు అడగిన ప్రశ్నలకు సరదాగా సమాధానాలు చెప్పాడు. ఈ క్రమంలోనే తొలి టీ20లో డీఆర్‌ఎస్ విషయంలో అలసత్వంగా ఉన్న దినేశ్ కార్తీక్‌పై రోహిత్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటనను సూర్య ముందు ప్రస్తావించగా.. అతను అసలు విషయం వెల్లడించాడు.
#SuryakumarYadav
#INDvsAUSt20series
#India
#Cricket
#RohitSharma
#DineshKarthik