IND vs PAK ఉత్కంఠ మ్యాచ్‌లో పాక్‌పై భారత్ విజయం *Cricket | Telugu OneIndia

Oneindia Telugu 2022-08-28

Views 4.8K

IND vs PAK - India Won the match Hardik Pandya stars with bat and ball as India beat Pakistan in thriller | పాకిస్థాన్ స్లో ఓవర్ రేట్ కారణంగా సర్కిల్ బయట నలుగురు ఫీల్డర్లు మాత్రమే ఉండాల్సి వచ్చింది. ఈ అవకాశాన్ని భారత బ్యాటర్లు ఉపయోగించుకున్నారు. నసీమ్ షా వేసిన 18వ ఓవర్‌లో జడేజా బౌండరీ, సిక్సర్ కొట్టాడు. 19వ ఓవర్‌లో హార్దిక్ పాండ్యా మూడు బౌండరీలు బాదడంతో భారత్ విజయసమీకరణం 6 బంతుల్లో 7 పరుగులుగా మారింది. అయితే మహమ్మద్ నవాజ్ వేసిన తొలి బంతికి రవీంద్ర జడేజా క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తీక్ సింగిల్ తీసి హార్దిక్ పాండ్యాకు స్ట్రైక్ ఇచ్చాడు. మూడో బంతిని హార్దిక్ డాట్ చేయడంతో మ్యాచ్ మరింత టెన్షన్‌కు గురిచేసింది. కానీ మరుసటి బంతినే హార్దిక్ సిక్సర్ బాది విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.

#IndiavsPakistan
#IndvPak
#AsiaCup2022
#IndiaWonBy5Wickets
#IndiaBeatsPakistan
#RohitSharma
#HardikPandya
#IndiaWontheMatch
#India
#Cricket

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS