Reports says that KCR has planned a massive rally with Yashwant Sinha in Hyderabad on the same day of Modi's visit in Hyderabad | ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ లో పర్యటించే రోజే, నగరంలో తమ సత్తా తెలిసేలా భారీ ర్యాలీ నిర్వహించాలని టిఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో జూలై 2వ తేదీన విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ కు రానున్నారు. ఈ క్రమంలో ఆయనకు ఘనంగా స్వాగతం పలుకుతూ, భారీ ర్యాలీ నిర్వహించాలని టిఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. యశ్వంత్ సిన్హా రాక నేపథ్యంలో బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి జలవిహార్ కు భారీ ర్యాలీ నిర్వహించడానికి టిఆర్ఎస్ వర్గాలు సమాయత్తమవుతున్నాయి.
#KCR
#PMModiHyderabadvisit
#TRSrally