మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత గోనుగుంట్ల సూర్యనారాయణ అలియాస్ వరదాపురం సూరి ఎమ్మెల్యే కేతిరెడ్డిపై మండిపడ్డారు. పట్టపగలు అందరూ చూస్తుండగానే తన వర్గీయులపై దాడి చేశారన్న వరదాపురం సూరి....పోలీసులు చర్యలు తీసుకుని ఎమ్మెల్యే కేతిరెడ్డిపై కేసు నమోదు చేయాలన్నారు. లేదంటే పోలీసుపైనే కోర్టుకు వెళతాం అంటూ హెచ్చరించారు.