కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పోడు భూముల విషయమై అటవీ అధికారులకు, ఆదివాసీల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రౌటుసంకటపల్లిలో పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులను అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అధికారులకు, రైతులకు మధ్య సుమారు 2 గంటల పాటు వాగ్వాదం జరిగింది. రైతులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చారు. పోడు రైతులను అడ్డుకోవడం సరికాదంటూ అటవీశాఖ అధికారులకు సూచించారు.