Telangana లో పోడు భూముల సమస్యలు తీరేలా కనిపించటం లేదు. అటవీ భూములవైపు వస్తున్నారని అధికారులు, గిరిజనులమని తమకు తెలియదని చూడకుండా ఫారెస్ట్ అధికారులు దాడులు చేస్తున్నారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా భద్రాద్రికొత్త గూడెం జిల్లా చంద్రగొండ మండలం ఎర్రబోడు గ్రామంలో గిరిజనులు తమపై ఫారెస్ట్ అధికారులు దాడి చేశారని ఆరోపిస్తున్నారు. పోడు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న తమపై బెల్టులతో ఫారెస్ట్ అధికారులు దాడి చేసి చావబాదారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.