Presidential Election 2022: NCP chief Sharad Pawar has indicated that he is not intrested as presidential candidate says reports | రాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్ రాగానే వెంటనే స్పందించిన కాంగ్రెస్, టీఎంసీ వంటి పార్టీలు పవార్ అభ్యర్ధిత్వంపై మొగ్గుచూపాయి. అంతే కాదు ఈ ప్రతిపాదనను మిగతా విపక్షాలకు కూడా పంపాయి. అయితే పవార్ మాత్రం నిన్న రాత్రి జరిగిన ఎన్సీపీ భేటీలో తాను రాష్ట్రపతి అభ్యర్ధిత్వంపై ఆసక్తిగా లేనని తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్దిగా ఉండేందుకు ఇష్టపడటం లేదని స్పషం చేశారు. దీంతో ఎన్సీపీ నేతలు కూడా పవార్ అభిప్రాయంతో షాక్ అయినట్లు తెలుస్తోంది.
#PresidentialElection
#SharadPawar
#BJP