No-trust vote in Pak Parliament updates
#imrankhan
#noconfidencemotion
#paknews
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో రాజకీయ పరిణామాలు మరింత సంక్షోభంలోకి కూరుకుపోయాయి. ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలో అధికారంలో ఉన్న పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయంగా కనిపిస్తోంది. తన పదవికి ఆయన రాజీనామా చేయడం తప్పకపోవచ్చంటూ వార్తలు వస్తోన్నాయి. ఇప్పటికే ప్రభుత్వం మైనారిటీలో పడింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలాన్ని కోల్పోయింది. ఇప్పటికే 30 మంది ఎంపీలు తమ మద్దతును ఉపసంహరించుకున్నారు.