Ravi Shastri కి గుడ్‌ బై చెప్పిన Kohli, Rohit || Oneindia Telugu

Oneindia Telugu 2021-11-09

Views 394

The captain and vice-captain were so overwhelmed as they gifted their respective bats to Ravi Shastri giving him a perfect send-off. The picture of the same is going viral on social media.
#ViratKohli
#RaviShastri
#RohitSharma
#RahulDravid
#T20WorldCup
#TeamIndia
#Cricket

టీమిండియా హెడ్ కోచ్‌గా పదవికాలం పూర్తి చేసుకున్న రవిశాస్త్రికి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన కానుకలతో వీడ్కోలు పలికారు. టీ20 ప్రపంచకప్‌ లో భాగంగా సోమవారం నమీబియాతో జరిగిన మ్యాచే కోచ్‌గా రవిశాస్త్రికి.. టీ20ల్లో కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ చివరి మ్యాచ్. దాంతో టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో భావోద్వేగాలు తారా స్థాయికి చేరాయి. కోచ్ రవిశాస్త్రితో పాటు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్‌ల పదవి కాలం కూడా పూర్తయింది. దాంతో ఈ ముగ్గురికి టీమిండియా సభ్యులు ఘనంగా వీడ్కోలు పలికారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తమ బ్యాట్‌లను రవిశాస్త్రికి బహుమతిగా అందజేశారు. డ్రెస్సింగ్ రూమ్‌లో శాస్త్రి రెండు బ్యాట్స్‌ పట్టుకొని నిలబడిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS